![]() |
![]() |
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు'(Ye Devi Varamo Neevu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -06 లో..... జానకమ్మని అంజలి ఇంటికి తీసుకొని వస్తుంది. అందరూ జానకమ్మని చూసి ఇప్పుడు ఎలా ఉందని అడుగుతారు. అందరు భోజనం చేసారా అని జానకమ్మ అడుగుతుంది. లేదని పిల్లలు చెప్తారు. దాంతో అంజలి అందరికి భోజనం వడ్డిస్తుంది. మనం ఇక్కడే ఉంటామా అని పిల్లలు అడుగుతారు. ఇక్కడే ఉంటామని అంజలి చెప్తుంది. లేదు మనం వెళ్లిపోతున్నాం. ఇదే నా నిర్ణయం అని జానకమ్మ చెప్పగానే అంజలి బాధపడుతుంది.
మరొకవైపు గీతాంజలి డల్ గా ఉంటుంది. అప్పుడే తన పిల్లలు వచ్చి మాట్లాడుతారు. ఏమైంది మమ్మీ అని అడుగుతారు. తను సైలెంట్ గా ఉంటుంది. అప్పుడే తన భర్త భానుచందర్ వస్తాడు. మమ్మీని నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి అని అందరిని పంపిస్తాడు. నువ్వు మీడియా వాళ్ళన్నదాని గురించి ఆలోచిస్తున్నావా. నువ్వేం టెన్షన్ పడకు నువ్వు అనుకున్నట్లుగానే వైజాగ్ లో గీత ఇనిస్టిట్యూషన్ పెడతావని అంటాడు. ఆ మాట అప్పుడే వస్తున్న గీతాంజలి నాన్న విని ఇప్పుడు అక్కడ ఎందుకు కాలేజీ కడుతుందని టెన్షన్ పడుతాడు. అతన్ని గీతాంజలి చూసి ఎప్పుడు వచ్చావ్ నాన్న అని మాట్లాడుతుంది.మరొకవైపు అనాధాశ్రమంలో ఉన్న అందరి పిల్లల అడ్రెస్ కనుక్కొని అందరికి జానకమ్మ ఫోన్ చేసి వచ్చి పిల్లలిని తీసుకొని వెళ్ళండి అని చెప్తుంది. అందరి అడ్రెస్ ఉంది అంజలి అక్క అడ్రెస్ లేదని ఒక అమ్మాయి జానకమ్మతో అంటుంది. ఆ తర్వాత అంజలి దగ్గరికి జానకమ్మ వెళ్తుంది. తను బాధపడుతుంటే దగ్గరికి తీసుకొని ఓదారుస్తుంది. మరొకవైపు గీతాంజలి తన కుటుంబంతో కలిసి భోజనం చేస్తుంది. అప్పుడే న్యూస్ లో భార్య పెళ్లికి ముందు తప్పు చేసి ఆ నిజం భర్తకి తెలియకుండా దాచింది. ఆ నిజం తెలిసి భర్త సూసైడ్ చేసుకున్నాడని వస్తుంది. దాంతో గీతాంజలి భోజనం దగ్గర నుంచి లేచి వెళ్ళిపోతుంది.
అలా మోసం చేసిన వాళ్ళు చావాలి.. వాడు ఎందుకు చావాలని భానుచందర్ అనగానే గీతాంజలి వాళ్ళ నాన్న భయపడుతాడు. ఆ తర్వాత గతంలో జానకమ్మకి గీతాంజలి వాళ్ళ అన్న చెక్కు ఇచ్చింది గుర్తు చేసుకొని ఆ చెక్కు చూస్తూ ఈ ఆధారంతో అంజలి పేరెంట్స్ ని కలవొచ్చని జానకమ్మ అనుకుంటుంది. తరువాయి భాగంలో చెక్కు ఆధారంగా గీతాంజలి ఇంటి అడ్రెస్ పట్టుకొని జానకమ్మ వెళ్తుంది. అక్కడ గీతాంజలి వాళ్ళ నాన్నతో జానకమ్మ మాట్లాడుతుంది. ఇరవై ఏళ్ల క్రితం మీ కొడుకు శివ శంకర్ బాబు ఒక పాపని ఇచ్చాడు. ఆ పాప ఇప్పుడు పెద్దగా అయిందని చెప్పగానే అతను టెన్షన్ పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |